చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు మీద పోటీ చేసిన వైసీపీ నేత భరత్ పై తాజాగా కేసు నమోదు అయింది. తిరుమల దర్శనం సిఫారసు లేఖల అమ్మకాలు చేపట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో భరత్ పై కేసు నమోదు చేశారు.
ఇక గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు రూ.3 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్‍పై కేసు నమోదు అయింది. భరత్ తో పాటు భరత్ PRO మల్లిఖార్జున్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల దర్శనం సిఫారసు లేఖలు,…తోమాల సేవకు గుంటూరు వాసుల నుంచి రూ.2.8 లక్షలు వసూలు చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ భరత్ పై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత చిట్టిబాబు. టిడిపి నేత చిట్టాబత్తుని చిట్టిబాబు ఫిర్యాదుతో అరండల్ పేట పీఎస్‍లో కేసు నమోదు చేశారు.