విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం లేదు.. జ‌గన్ పై సీబీఐ కోర్టు సీరియ‌స్

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ పై సీబీఐ కోర్టు సీరియ‌స్ అయింది. ప్ర‌తి సారి ఏదో ఒక కార‌ణం చెప్పి అత‌ని పై కేసుల విచార‌ణ కు హాజ‌రు కావ‌డం లేదని ఆగ్ర‌హించింది. హెటిరో, అర‌బిందోల‌కు భూ కేటాయింపుల‌కు సంబంధించిన కేసుల విచార‌ణలో జ‌గ‌న్ కోర్టు రావ‌డం లేద‌ని జ‌గ‌న్ తరుపు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తో సీబీఐ కోర్టు అంది. అలాగే బెయిల్ ష‌ర‌తుల ప్ర‌కారం ప్ర‌తి విచార‌ణ కు హాజ‌రు కావాల‌ని క‌దా అని ప్ర‌శ్నించింది. దీనిప జ‌గ‌న్ త‌రపు న్యాయ‌వాది స్ప‌దిస్తూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి గా ఉన్నార‌ని ఆయ‌న స‌మ‌యం స‌హ‌క‌రించ‌క‌నే హాజ‌రు కాలేక పోతున్నార‌ని అన్నారు.

అలాగే అప్ప‌టి ప‌రిస్థితుల‌కు ఇప్ప‌టి ప‌రిస్థితుల కు చాలా తేడా ఉంద‌ని అన్నారు. అప్పుడు వారినికి ఒక్క రోజు మాత్ర‌మే విచార‌ణ ఉండేద‌ని అన్నారు. కానీ ఇప్పుడు వారానికి ఐదు రోజుల విచార‌ణ సాగుతుంద‌ని అన్నారు. అయితే ఈ విచార‌ణ కు కూడా హాజ‌రు కావాల‌ని ఆదేశిస్తే.. హాజ‌రు అవుతార‌ని తెలిపారు. కాగ ఈ కేసు విచార‌ణ‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక విచార‌ణ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని సీబీఐ కోర్టు లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భం గా సీబీఐ కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.