ఓమిక్రాన్ పై రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం..

-

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువ అవుతోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 200 పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలోనే సగం కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ కేసుల విషయంలో మూడో స్థానంలో ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఓమిక్రాన్ మరణం లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశం.

కాగా తాజాగా ఓమిక్రాన్ పై కేంద్రం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. డెల్టా కన్నా ఓమిక్రాన్ మూడు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోందని హెచ్చిరించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో ఓమిక్రాన్ కట్టడిలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వైరస్ ను గుర్తించిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టుల వద్ద విదేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేసింది. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే.. ఓమిక్రాన్ ఉందో లేదో తెలియడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లను పంపిస్తున్నారు. ఒక వేళ ఓమిక్రాన్ పాజిటివ్ వస్తే.. ఐసోలేషన్ కు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news