BREAKING : అవినాష్ కాన్వాయ్ ని సీబీఐ అధికారులు ఛేజింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అవినాష్ రెండోసారి విచారణ డుమ్మా కొట్టడం పై సీబీఐ సీరియస్ అయింది. పులివెందుల వెళ్తున్న అవినాష్ రెడ్డి కాన్వాయ్ వెంట ఫాలో అవుతూ అడ్డుకునే ప్రయత్నంలో సీబీఐ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చింది. ఈ రోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి తన తల్లికి గుండెపోటు వచ్చిందని సమాచారం ఇచ్చి, తాను సీబీఐ విచారణకు హాజరు కాలేను అని చెప్పి పులివెందుల వెళ్లిపోయారు. అవినాష్ రెండోసారి విచారణ డుమ్మా కొట్టడం పై సీబీఐ సీరియస్ అయింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.