వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

-

 

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో నేడు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు అవినాష్ రెడ్డి. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు..వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిపై చార్జిషీట్ వేసిన సీబీఐ… వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది.

వివేకా హత్య కేసులో 145 పేజీల తో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఇక జూన్ 19 తేదీన సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాష్ రెడ్డి… దర్యాప్తు ను పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి.. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ సీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లెక్కలో పేర్కొన్న అవినాష్ రెడ్డి… వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని లేఖ లో పేర్కొన్నారు. ఇక ఈ లేఖ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీబీఐ.

Read more RELATED
Recommended to you

Latest news