చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసిబి కోర్టు ఇవాళ విచారించనుంది. ఆన్లైన్ ద్వారా చంద్రబాబును విచారణకు హాజరుపరచాలని రాజమండ్రి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను తమకు ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్లు వేయగా…. న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఇది ఇలా ఉండగా, మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.