Good News: జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు

-

దసరా పండుగకు వారం రోజుల సమయం కూడా లేదు. దీంతో హైదరాబాద్‌ లో ఉన్నటువంటి ప్రజలు.. తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ తరుణంలోనే.. ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులను నడపాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది. జేబీఎస్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లాలంటే గతంలో ఎంజిబీఎస్ కు రావాల్సి వచ్చేది.

RTC services from JBS to Vijayawada
RTC services from JBS to Vijayawada

ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఇకపై జేబీఎస్ మీదుగా విజయవాడకు కొన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపనున్నారు.

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బోయిన్పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఎంతో మేలుకలగనుంది. బీహెచ్ఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే ఈ 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇకపై జేబీఎస్ మీదుగా నడపనున్నారు. ఈనెల 18 నుంచే ఈ 24 బస్సు సర్వీసులు జేబీఎస్ నుంచి రాకపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news