చంద్రబాబుకు ఆ వ్యాధి ఉంది – మాజీ మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చాలా ప్రస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తండ్రి కొడుకులు రాష్ట్రమంతా తిరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎల్లో మీడియాను చూసుకొని బలుపుతో ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కన్నబాబు.

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటి ముద్దుబిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇక పెత్తందారులకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టిందని.. ఆయనకి తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలని వ్యాధి వచ్చిందన్నారు. ఈ వ్యాధి కారణంగానే అమరావతిని రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు కన్నబాబు. వచ్చే ఎన్నికలలో వైసిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news