ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 22కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నందున ఆ గడువు వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని అడవకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. తొందరపాటు చర్యలు ఏమీ తీసుకునే ఉద్దేశం లేదని తెలిపారు ఏజీ.
రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ.. అందిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ కి వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యల కారణంగా మూడు వారాల పాటు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.