సొంతపార్టీ నేతలను సైతం అలా ఏమార్చుతున్న బాబు!!

ఏపీ టీడీపీలో కొత్త కమిటీల ఎంపిక సక్సెస్ ఫుల్ గా చేశారు చంద్రబాబు. ఆల్ మోస్ట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక పదవి ఇచ్చి కుర్చోబెట్టారు. అయితే ఈ విషయంలో కొంతమందికి వారి వారి స్థాయిలకు సరిపడా సమకూర్చలేదో లేక మరేమిటో తెలియదు కానీ… సరైన న్యాయం చేయలేకపోయారు. దీంతో వారంతా అలిగారంటూ కథనాలు రాయించుకుంటున్నారు బాబు! ఇంతకూ ఆ అలిగిన పెద్దలు ఎవరు.. అంతగా అలిగేటంత లెవెల్ ఆ పదవులకు ఈ పరిస్థితుల్లో ఉందా?

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత అనేకమంది నేతలు పార్టీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే! పైగా చినబాబు వ్యవహారాలు పెద్ద బాబు అనాలోచిత చర్యలు కలిపి పార్టీకి చాలా మందిని దూరం చేశాయి. అయితే ఈ క్రమంలో పార్టీని వీడలేక బయటకు పోలేక ఉన్న కొంతమందికి పార్టీలో ఈ పదవులు ఇవ్వలేదు బాబు! ఆ విషయం వారికీ తెలుసు బాబుకీ తెలుసు… అయినా కూడా వారు అలిగారంట.. బాబు అంత అమాయకులా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మొదలైన నేతలకు తమ లెవెల్ కు సరిపడా పదవులు దక్కలేదు!! అయినా కూడా వారు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా లేదు! కానీ… దీనివల్ల ఏపీ టీడీపీలో తెగ గొడవలు జరుగుతున్నాయని.. బాబు వారిని బుజ్జగిస్తున్నారని.. బాబు ప్రకటించిన పదవులు అంత గొప్పవని.. వాటిలో బీసీలకు పెద్దపీట వేశామని చెప్పుకోవడానికన్నట్లుగా… పసుపు పత్రికల్లో కథనాలు రాసి ఆఖరికి సొంతపార్టీ నేతలను సైతం బాబు ఏమార్చేపనికి పూనుకుంటున్నారు!!