పెళ్లి చేసుకుని పారిపోయిన మొగుడు చంద్రబాబు!

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుల ఆమోదంతో ఏపీలో రాజకీయ వాతావరణం ఫుల్ గా హీటెక్కింది! ఈ విషయాలపై టీవీ ఛానల్స్ లో డిబేట్ లే డిబేట్ లు జరిగిపోతున్నాయి. కొన్ని ఛానల్స్ లో టీడీపీ నేతలకంటే ఎక్కువగా ఆ డిబేట్ నిర్వహిస్తోన్న యాంకర్లే మరీ తీవ్రంగా రెచ్చిపోతున్నారు. మోకాలికి బోడిగుండుకీ ముడిపెట్టేపనికి పూనుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ పార్టీ ఈ విషయంపై మాట్లాడినా… అది తిరిగి తిరిగి బాబు దగ్గరకు వచ్చే ఆగుతుంది. ఫలితంగా బాబు రహస్య స్నేహితులతో కలిపి అంతా “మొత్తం మీరే చేశారు సర్” అంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… నేడు అమరావతి రైతులగురించి ఆలోచించేవారు ఏరి అన్న దగ్గర మొదలవుతున్న చర్చలు… అసలు అన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరించారు అనే మాట దగ్గర ఆగుతుంది. ఫలితంగా నేడు అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులకు, బాదలకు చంద్రబాబే కారణం అని ముగుస్తుంది. ఈ విషయాలపై స్పందించిన కమ్యునిస్టులు… అన్ని వేల ఎకరాలు వద్దని నాడు చంద్రబాబుకు చెప్పినా కూడా.. తమ మాట ఏమాత్రం వినలేదని, ఫలితం నేడు రైతుల ఆవేదనల్లో అర్ధమవుతుందని అంటున్నారు.

ఇదే క్రమంలో… మోడీ దగ్గర 2 – 3 వేల ఎకరాలకు రాజధాని సరిపోతుందని తలాడించి.. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కుర్చీ ఎక్కినతర్వాత.. 33వేల ఎకరాలు చేశారని పవన్ అంటున్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకోసం చేసిన చర్యగానే అభివర్ణిస్తున్నారు. ఇదే క్రమంలో… వైకాపా రెబల్ ఎంపీ స్పందిస్తూ… “నన్ను చూసి ఇవ్వండి” అని రతులను భూములు అడిగి అనంతరం “నన్ను చూసే ఇచ్చారని” చంద్రబాబు చెప్పుకోవడం వల్ల.. నేడు రైతుల బాధ్యత పూర్తిగా బాబుపైనే పడిందని అంటున్నారు.

తనను నమ్మి ఇవ్వండి, తనను చూసి ఇవ్వండి అని కబుర్లు చెప్పి… నేడు ఆ బిల్లులు ఆమోదంచెందకుండా చేసుకోలేకపోవడం సంగతి అటుంచితే… టెంపరరీ పేరు చెప్పి రైతులను, ఏపీ ప్రజలనూ, కేంద్రంలోని పెద్దలనూ మోసం చేయకుండా ఉండి ఉంటే… నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. ఫలితంగా పెళ్లి చేసుకుని పారిపోయిన మొగుడు గా చంద్రబాబు మిగిలారని అంటున్నారు!! బాబు స్వార్థపూరిత విజన్ అమరావతి రైతులకు అంత పని చేసిందన్నమాట!!