సొమ్ములు ఇస్తా..! దమ్ము చూపించమంటున్న బాబు ?

-

అసలు తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే మొదటగా గుర్తుకు వచ్చేది బీసీలు. ఆ పార్టీని స్థా పించిన దగ్గర నుంచి బీసీలే ఆ పార్టీకి వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆ సామాజిక వర్గం లో పూర్తిగా మార్పు కనిపించింది. టిడిపి ప్రభుత్వంలో బీసీలకు పెద్దగా న్యాయం జరగకపోవడంతో, వారంతా వైసీపీ వైపు నిలబడ్డారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన బాబు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున పార్టీ పదవులను భర్తీ చేశారు. ఆ పదవుల్లో బిసి సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం, బీసీలు వైపే టిడిపి అనే సంకేతాలు ఇవ్వడంతో, కాస్త జోష్ కనిపించింది. ఇక వారితో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయించి, వారి ఆదరణ వైసిపికి తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి   పదవులు పొందిన వారు, ఇలా చాలా మంది ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం బాబు దృష్టికి వెళ్ళింది. అసలు వీరు ఎందుకు పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు అనే విషయాన్ని జగన్ ఆరా తీయగా, వారంతా ఆర్థిక వ్యవహారాల కారణంగానే పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారే ఈ పదవుల్లో ఎక్కువగా ఉండడం, భారీ ఎత్తున సొమ్ములు మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, మళ్లీ ఇప్పుడు పార్టీ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున సొమ్ము లు ఖర్చు పెట్టే అంత స్తోమత  లేకపోవడం, ఇలా ఎన్నో వ్యవహారాలతో వారు ముందుకు రావడం లేదనే విషయాన్ని బాబు గ్రహించారు.

ఇకపై పార్టీ కార్యక్రమాలు ఖర్చులు మొత్తం టిడిపి కేంద్ర కార్యాలయం భరిస్తుందని, ఆర్థిక అంశాలను పక్కన పెట్టి పూర్తిగా ప్రజా పోరాటాలు ఉద్యమాలు పైన దృష్టి సారించాలని, ఈ విషయంలో ఎవరు వెనుకడుగు వేయవద్దని, పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎప్పుడు సిద్ధంగానే వుంటుంది అనే విషయాన్ని బాబు చెప్పడంతో, పార్టీ శ్రేణుల్లో,  కాస్త ఉత్సాహం కనిపిస్తోందట. వైసిపి ప్రభుత్వం క్రేజ్ ను తగ్గించడం ద్వారా, వచ్చే ఎన్నికల్లో టిడిపికి అవకాశం ఉంటుందని, మళ్లీ మనం అధికారంలోకి రాబోతున్నాం అంటూ చంద్రబాబు వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత తాను అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని, ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపు వైఖరిపై ఎవరు ఆందోళన చెందవద్దని, అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని టీడీపీకి మళ్లీ మంచి రోజులు వచ్చేలా చేసే బాధ్యత మీ పైనే ఉంది అంటూ బాబు అదేపనిగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారట. బాబు ఉత్సాహాన్ని తెలుగు తమ్ముళ్లు ఎంతవరకు అర్థం చేసుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంం చేస్తారో చూడాలి .

-Surya

Read more RELATED
Recommended to you

Latest news