బిజెపి టచ్ లో బాబు ? జమిలి జపం వెనుక రాజకీయం ?

నలుగురిది ఒక దారి అయితే , తన దారి మరొకటి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, ఆయన చేసే రాజకీయం ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. అసలు జమిలి ఎన్నికల ప్రస్తావన ఎవరు దేశవ్యాప్తంగా తీసుకు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు  ఉన్న వారు ఎవరు   జమిలి ఎన్నికలు ప్రస్తావన తీసుకు రావడం లేదు కానీ చంద్రబాబుు మాత్రం 2022 లో కచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయంటూ పార్టీ శ్రేణులకు నూరిపోస్తూ, హడావుడి చేస్తున్నారు. బాబు హడావుడి చేసిన ఈ సమయంలోనే బీజేపీ నేతలు సైతం జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేంద్రం లేదంటూ, ప్రకటించినా, బాబు మాత్రం జమిలి ఎన్నికల జపం చేస్తూనే వస్తున్నారు. దీంతో అసలు నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే కోణంలో, ఇప్పుడు అంతా బాబు మాటలపై ఆరా తీస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ పార్టీ అగ్ర నాయకులు ను అదేపనిగా పొగుడుతూ, వస్తున్నా,  బీజేపీ నుంచి స్పందన కనిపించడం లేదు. అయితే వీలు కుదిరినప్పుడల్లా, బిజెపి అగ్రనాయకులు అందరికీ బాబు ఫోన్ చేస్తూ, కుశల ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు బాబు పదేపదే ఫోన్ లు చేస్తూ, ఆయన్ను పరామర్శిస్తూ, పలకరిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇటీవల అనారోగ్యానికి గురైన కేంద్రమంత్రి గోయల్ ను   సైతం బాబు ఇదేవిధంగా పరామర్శించారు. అయితే బాబు ఫోన్ పరామర్శలు బిజెపి లోని కొంతమంది నాయకుల్లో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఆ అగ్రనాయకుల ద్వారానే, బాబుకు జమిలి ఎన్నికల సమాచారం అందినట్లు రాజకీయ వర్గాలు ఇప్పుడు అనుమానిస్తున్నాయి. జమిిిలి ఎన్నికల ఆలోచన కేంద్రానికి ఉన్న , ప్రస్తుత పరిస్థితుల్లో దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు . దీనిపై ఇంకా బీజేపీలో పూర్తి స్థాయిలో చర్చ పూర్తవలేదు. అయితే దీనిని బాబు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమైపోయారు. ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా పెంచేందుకు , అలాగే పార్టీ మారాలని ఆలోచన చేసే నాయకులు వైఖరిలో మార్పు వస్తుందని, పార్టీ శ్రేణులు సైతం ఉత్సాహంతో పని చేస్తాయని  అభిప్రాయంతో బాబు   ఆ  ఎన్నికలపై ఈ విధంగా కలవాట్లు పలుకుతున్నట్లుగా కనిపిస్తోంది.
-Surya