రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి బాబు సరికొత్త స్కెచ్!

-

ఎవరు అవునన్నా, కాదన్నా… నేడు అమరవతి రైతులకు జరిగిన అన్యాయంలో కీలక పాత్ర, ప్రముఖ పాత్ర, పరిపూర్ణమైన బాధ్యత చంద్రబాబుదే అనేది దాదాపు అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్న మాట. దానికి కారణం వేల ఎకరాలు సేకరించడమే! రైతులకు వాస్తవాలు చెప్పకుండా, జనాలకు చూపించిన గ్రాఫిక్సే అమరావతి రైతులకు చూపించి, భ్రమలు కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీంతో తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం అనంతరం వారి ఆవేశం కాసేపు జగన్ పై ఉన్నా, అనంతరం వాస్తవాలు గ్రహించిన కొందరు రైతులు మాత్రం… నేరమంతా బాబుదే అని క్లారిటీ ఇస్తున్నారు! ఈ క్రమంలో బాబుకు సరికొత్త స్కెచ్ వేశారు!

తాజాగా వాస్తవాలు గ్రహించిన అమరావతి రైతులు… బాబుని నమ్మి భూములు ఇచ్చామని.. కాని బాబు కట్టిన టెంపరరీ బిల్డింగుల వల్లే నేడు అమరావతి తరలింపుకు కారణం అయ్యిందని.. తమ భూముల పట్ల బాధ్యత ఉన్నప్పుడు పర్మినెంట్ బిల్డింగులు కట్టకుండా తప్పుచేశారని.. గ్రాఫిక్స్ కి, విదేశీయాత్రలకు వెచ్చించిన సమయం రాజధాని నిర్మాణంలో కనబరచలేదని.. వాటన్నింటి ఫలితమే నేడు రాజధాని తరలింపు అని ఆవేదన చెందుతున్నారంట బాబుని నమ్మి భూములిచ్చిన రైతులు! ఈ క్రమలో… వారిని శాంతింపచేయడంతోపాటు.. ఈ విషయంలో తప్పించుకునే క్రమంలో బాబు చేసిన సరికొత్త ఆలోచన… “ప్రజా తీర్పు కోరండి” అని!

అమరావతిలోని 29 గ్రామలలోని భూములిచ్చిన రైతుల సంగతి కాసేపు పక్కనపెడితే… రాష్ట్రం మొత్తం రెఫరెండం పెడితే… కచ్చితంగా మూడు రాజధానులకు ప్రజలు ఆమోదం తెలిపే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాటగా ఉంది. గతంలో ఇంగ్లిష్ మీడియం విషయంలో కూడా కోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకంగా వచ్చినా కూడా… తల్లితండ్రుల అభిప్రాయంలో వచ్చిన ఫలితం సంగతి తెలిసిందే. కాబట్టి… చంద్రబాబు కూడా అదే ఆలోచన చేసి… నేడు అమరావతిలో రైతుల కన్నీటికి కారణం అయిన తాను, తప్పించుకునే క్రమంలో… మిగిలిన ప్రాంతాల ప్రజల మీదకు నెట్టెయ్యాలని భావిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!

“ప్రజా తీర్పు అలా వచ్చింది మరి… ఈ సమయంలో మనం మాత్రం ఏమి చేయగలం…” అంటూ నేరాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మీదో, జగన్ మీదో వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి… ఆ నెపాన్ని తిరిగి మిగిలిన ప్రాంత ప్రజలపై వేసి, తాను సేఫ్ అవ్వాలని బాబు భావిస్తున్నట్లున్నారు! అందులో భాగంగానే… “ప్రజాతీర్పు కోరండి.. కనీసం రెఫరెండం పెట్టండి.. మూడు రాజధానులకు సరే అని జనమంటే ఇక ఆ అమరావతిపై మాట్లాడను…” అంటూ చెప్పుకొస్తున్నారు! నా బొందులో ఊపిరున్నంతవరకూ అమరావతి కోసం పోరాడతాను అనాల్సిన బాబు… రెఫరెండంలో అన్ని ప్రాంతాల జనం సరే అంటే… ఇంక అమరావతి టాపిక్కే ఎత్తనని చెప్పడాన్ని… తప్పించుకుతిరిగే తలంపులో భాగంగా చెబుతున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Latest news