బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మరణ వార్తతో విషాదానికి లోనయ్యానని చిరంజీవి పేర్కొన్నారు. ఓ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
Saddened to learn about prominent politician & Ex.Minister Sri.P.Manikyala Rao's demise due to Corona.A compassionate human being,Sri.Rao made a humble beginning & grew to assume important political positions. May his soul rest in peace.Deepest condolences to his family members
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 1, 2020
కాగా, మాణిక్యాల రావు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన దాదాపు నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. మాణిక్యాల రావు చంద్రబాబు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.