ఏమంటారు తమ్ముళ్లు…. ఏదొకటి అనండయ్యా!

-

అమరావతి విషయంలో బాబు ఆల్ మోస్ట్ చేతులెత్తేశారు. చినబాబు కనుమరుగైపోయారు. చంద్రబాబుకు విపరీతమైన బలముంది, సామాజికవర్గ శక్తి ఉంది అని చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతల్లో దేవినేని ఉమ, బోండా ఉమ తప్ప పెద్దగా మాట్లాడేవారు కరువయ్యారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు “తప్పించుకు తిరుగుతువాడు ధన్యుడు సుమతీ” అన్న చందంగా మారిపోయారు! ఇలాంటప్పుడు బాబు మైకందుకున్నారు… తమ్ముళ్లూ… అని ఒక పని అప్పగిస్తోన్నారు!

మూడు రాజధానుల విషయంలో కేంద్రం కల్పించుకోవాలని.. బీజేపీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని బీజేపీ నేతలు చెబుతున్నా… బాబు అదేమాట అంటున్నారు. అనంతరం తాజాగా… మూడు రాజధానుల విషయంలో తమ్ముళ్లంతా రోడ్లపైకి రావాలని, ఆందోళన చేయాలని బాబు పిలుపుస్తున్నారు. మరి ఎవరెవరు స్పందిస్తున్నారు.. ఎందరు స్పందిస్తున్నారు అనేది ఇప్పుడుచూద్దాం!

చంద్రబాబు పిలుపు మేరకు కృష్ణా, గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు కూడా స్పందించడం మానేశారు. ఎవరికో ప్రయోజనం కలిగించడం కోసం తామెందుకు కష్టపడాలనుకున్నారో లేక.. స్థానిక ప్రజలు ఊస్తారని భయపడ్డారో తెలియదు కానీ… ఉత్తరాంధ్ర – రాయలసీమ కార్యకర్తలైతే గమ్మునున్నారు! బాబు మాటను ఇలా తమ్ముళ్లే పెడచెవిన పెట్టి లైట్ తీసుకుంటుంటే… ఈసారి ప్రజలంతా రావాలని బాబు పిలుపునిస్తున్నారు!! తమ్ముళ్లే బాబు మాట వినని పరిస్థితుల్లో… ఇక ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని బాబు కోరడాన్ని ఏమనాలి!… ఏదొకటి అనండి తమ్ముళ్లూ?

Read more RELATED
Recommended to you

Latest news