ఇటీవల కుప్పంలో టిడిపి – వైసిపి వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిడిపి చీఫ్ చంద్రబాబుకు భద్రతను పెంచింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేసింది. 12+12 ఎన్ఎస్జి కమాండోలతో భద్రతను పెంచారు. ఇంతకుముందు 6+6 ఎన్ఎస్జి కమాండోలు చంద్రబాబుకు భద్రతను పర్యవేక్షించేవారు. అయితే కుప్పంలో రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 12+12 విధానంలో 24 మందితో భద్రతను పెంచింది.
దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుకు 24 మంది ఎన్ఎస్జి కమాండోలతో భద్రత కల్పిస్తున్నారని.. ప్రస్తుతం టిడిపికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 23, కానీ చంద్రబాబుకు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి కుప్పం ప్రజల నుంచే చంద్రబాబుకు నిజమైన ముప్పు పంచి ఉందని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని వివరించారు.