ఇవాళ పోలవరం కు చంద్రబాబు నాయుడు… షెడ్యూల్ ఇదే

-

నేడు పోలవరంకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనులపై పరిశీలన, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన  మొదటి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు.

Chief Minister Chandrababu Naidu arrived in Polavaram today

సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడంతోపాటు, ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. ఇవాళ ఉదయం  11 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి 11. 45 ని.లకు చేరుకుంటారు.  మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 1. 30 ని.ల వరకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకుంటారు.

అనంతరం మధ్యాహ్నం 1. 45 ని.లకు ప్రాజెక్ట్ అతిధి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2. 05 ని.ల నుండి 3. 05 ని.ల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు.  సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ సైట్ నుండి హెలికాప్టర్ లో ఉండవల్లి బయలుదేరి వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news