ఉచితం అంటే ఎవరూ పెత్తనం చేయటానికి వీలు లేదు. ఇసుక ఎక్కడ అందుబాటులో ఉన్నా ఉచితంగా తీసుకువెళ్లొచ్చు. ఇసుక లేకపోతేనే రీచ్ లకు వెళ్ళాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం మొత్తానికి మెసేజ్ ఇస్తున్నా. ఇసుక దొరకని ప్రాంతాలు ఉంటే వాళ్ళు మాత్రమే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మద్యం బాబులకు నిన్ననే శుభవార్త చెప్పా. మద్యంపై దోపిడీ సాగించారు.. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు.
ఎవరి మతం మీద వాళ్లకు విశ్వాసం ఉంటుంది. కానీ తిరుపతి మత విశ్వాసాన్ని దెబ్బ తీశారు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి తీసుకువచ్చి దేవుడికి నైవేద్యం పెట్టారు. ఆవు నెయ్యికి కనీసం 500 రూపాయల ధర ఉంది.. 320 రూపాయలకు తక్కువ ధరకు నెయ్యి తీసుకు వచ్చారు. గతంలో ప్రసాదాలకు.. ఇప్పటి ప్రసాదాలను ఎంత తేడా ఉందో అందరూ గమనిస్తున్నారు. శ్యామలరావు అనే ఒక అధికారిని వేసాను.. ఆయనకు ఒకటే చెప్పాను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పా అని చంద్రబాబు తెలిపారు.