చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌..గెలిస్తే

-

కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానమని.. భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

cm jagan
cm jagan

చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగిందని.. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. 175 కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని వైసీపీ కార్యకర్తలకు, నేతలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.

కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నామని.. కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుగారికి మద్దతుగానే ఉందని బయట ప్రపంచం అంతా అనుకుంటారని వెల్లడించారు. వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news