TDP అంటే తినుకో, దండుకో, పంచుకో అని అర్థమంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి పథకం కింద.. పిల్లలను బడికి పంపించే 42,61,965 మంది నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయడం జరుగుతోందన్నారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఇప్పటివరకు ఒక్క అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని అందించామని చెప్పారు సీఎం వైయస్ జగన్. టీడీపీ అంటే తినుకో, దండుకో, పంచుకో.. వాళ్లకు కడుపులో మంట ఈర్ష్యతో కళ్లు మూసుకుపోయాయని విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహించారు సీఎం వైఎస్ జగన్. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ‘ఆయనలా మనం రౌడీల్ల తొడలు కొట్టలేం…బూతులు తిట్టలేం… వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేము.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుమీదికి తీసుకురాలేం… వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే సాధ్యం’ అని జగన్ వాక్యానించారు.