ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన “సాగర తీరాన స్వచ్ఛత” కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సాగర తీరంలో 20 వేల మందితో 28 కిలోమీటర్ల మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్ ను తొలగించామని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ సరికొత్త లుక్ లో కనిపించారు. వేదికపై నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఆకట్టుకున్నారు. ఈ వీడియోని మాజీ మంత్రి కొడాలి నాని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇకపైలో ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. ఇప్పటికే టీటీడీ విజయవంతంగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ మన సంకల్పం అని తెలిపారు. ఆహ్వానాలు, సభలకు కాస్త ఖర్చు ఎక్కువైనా.. క్లాత్ తో తయారు చేసే ఫ్లెక్సీ లనే పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
జగనే మా హీరో ❤️
#CMYSJagan #ParleyForTheOceansVizag pic.twitter.com/ti0AFr5Gfz— Kodali Nani (@IamKodaliNani) August 26, 2022