టీడీపీ కార్యకర్తలకు సీఎం జగన్ బిగ్ షాక్ ..అజ్ఞాతంలో తెలుగు తమ్ముళ్లు?

-

 

టీడీపీ కార్యకర్తలకు సీఎం జగన్ బిగ్ షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో కుప్పంలో నిరసన తెలిపిన టిడిపి నేతల పై కేసులు నమోదు చేసింది ఏపీ సర్కార్‌. ఆర్టీసీ బస్సుల ధ్వంసం కేసుల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో పాటు మరో 50 మంది టీడీపీ నాయకుల పై కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

CM Jagan is a big shock for TDP workers
CM Jagan is a big shock for TDP workers

341, 427 r/w IPC,3 PDPPA సెక్షన్ల కింద టీడీపీ నేతల పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే.. పలువురు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక వరుస అరెస్టుల నేపథ్యంలో అజ్ఞాతంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.

కాగా, నేడు మాజీ సీఎం నారా చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ఉండనుంది. ఈ ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు జైలు అధికారులు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును కలవనున్నారు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి. జైలులో చంద్రబాబుకు వ్యక్తిగత సహాయకుడిగా మాణిక్యం ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news