ఇవాళ కడపకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కడపలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.

11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న సీఎం.. రెండు గంట పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.. మూడు గంటలకు వేంపల్లి చేరుకోనున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు వేంపల్లిలో బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్.. సాయంత్రం 5:30 కు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్.. దివంగత నేత రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం కానున్న ముఖ్యమంత్రి.. 11 గంటలకు ప్లీనరీ సమావేశాలకు హాజరు కానున్నారు.