అమ్మఒడిపై జగన్ కీలక నిర్ణయం.. వచ్చేఏడాది నుంచి ఈ మార్పులు

-

స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుక పై ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమని.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలి విడతలో 15వేలకు పైగా స్కూళ్లు తీర్చిదిద్దామన్నారు. అమ్మ ఒడి పథకం అమలు ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామని… కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

2022 నుంచి అమ్మ ఒడి పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలని.. అకడమిక్‌ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది అమల్లోకి తీసుకుని రావాలని… అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని.. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ఉండాలని పేర్కొన్నారు.

మ్యాపింగ్‌చేసి.. ప్లే గ్రౌండ్‌ లేని చోట భూ సేకరణ చేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలని.. ఈమేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలని.. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకు రావాలనుకున్నా దాని వెనుకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలని స్పష్టం చేశారు. టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news