పాఠశాలలో టీవీలు ఏర్పాటు చేయండి -సీఎం జగన్ ఆదేశాలు

-

విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తాం.. ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని ఆదేశించారు. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి.. ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని పేర్కొన్నారు.


టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలి.. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ విద్యార్థి 9, 10 తరగతుల్లో కూడా పని చేయాలని వెల్లడించారు. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించండని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలి.. వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా అర్థం అవుతాయన్నారు. టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని.. జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news