గజ దొంగల ముఠాతో నాకు.. ఓ యుద్ధం జరగబోతోంది -సీఎం జగన్‌

-

గజ దొంగల ముఠాతో నాకు.. ఓ యుద్ధం జరగబోతోందని చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్‌. కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్‌.. వరుసగా ఐదో సారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల చేశారు. మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయం అందించిన సీఎం జగన్‌.. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…. నా నమ్మకం మీరు, నా ధైర్యం మీరు.. వాళ్లు చెబుతున్న అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మళ్లీ ఆశీర్వదించండి.. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడే కర్నూలు జిల్లా గుర్తొచ్చిందని ఆగ్రహించారు సీఎం జగన్‌. రైతు బాగుంటేనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ.. గతంలో చంద్రబాబు హయాంలో కరువే కరువు అంటూ మండిపడ్డారు సీఎం జగన్‌. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని ఆగ్రహించారు. ప్రతీ రైతుకు ఇప్పటివరకు రూ.54 వేలు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. ఐదేళ్లలో ప్రతీ రైతు ఖాతాలో రూ.61,500 జమ.. రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడొద్దు.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news