ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు ఎవరూ కూడా డుమ్మా కొట్టవద్దని… ప్రతి ఒక్కరు కచ్చితంగా హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు ఆదేశాలు అందాయి.
ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో గైడ్ లైన్స్ ను జారీ చేశారు. ఇక ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం పదిన్నర గంటలకు మాకు పోలింగ్ ను కూడా వైసీపీ నిర్వహించనుంది. దీంతోపాటు కీలకమైన… పది బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కాగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో పార్టీ పటిష్టత పై సీఎం జగన్ ఫోకస్ చేశారు.