YSR జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు – సీఎం జగన్

-

ఇవాళ వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టనుంది వైసీపీ పార్టీ. ఈ కార్యక్రమంలో…. సజ్జల, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.

అయితే.. ఇవాళ వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ ట్విట్టర్ లో స్పందించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా అంటూ ఎమోషనల్‌ అయ్యారు. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందని.. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు అన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news