రైతులకు గుడ్‌న్యూస్..రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్‌

 

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. పంట నష్టపరిహారం రూపంలో ఇన్పుట్ సబ్సిడీతో పాటు వడ్డీ రాయితీని కూడా ఒకేసారి రైతులకు చెల్లించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాలో నగదుద్యం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

cm jagan
cm jagan

ఈ ఏడాది కరెక్ట్ సీజన్ లో గోదావరి వరదల రూపంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలను రైతులు పంటను కోల్పోయారు. గోదావరి వరదల తర్వాత కార్ వర్షాలతో అనేక చోట్ల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రత్యేకించి ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా కొనసాగిన సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులు పెట్టుబడి కోల్పోయారు. అయితే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆ రాయితీని ఇవాళ రిలీజ్ చేయనున్నారు.