ఈ నెల 22వ తేదీన దావోస్ వెళ్లనున్న సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే

ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం జరుగనుంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ నేతృత్వంలో దావోస్ వెళ్లనుంది ఏపీ బృందం… సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన, గుడివాడ, ఎంపీ మిధున్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. దావోస్ సదస్సుకు చెందిన కర్టెన్ రైజర్ బ్రౌచర్ విడుదల చేశాఉ మంత్రి గుడివాడ అమర్నాధ్.

దావోస్ సదస్సు పెట్టుబడుల కోసం కాదని.. దావోస్ సదస్సు ముగిసిన వెంటనే ఏపీకి పెట్టుబడులు రావన్నారు గుడివాడ అమర్నాధ్. ఏపీ ప్రభుత్వ విధానాలను.. ఏపీలోని అవకాశాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా షో కేస్ చేస్తామని.. సదస్సు ముగిసిన తర్వాత.. పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తామని ప్రకటన చేశారు.

పీపుల్-ప్రొగ్రెస్-పాజిబులిట్స్ అనే థీమ్ తో దావోస్ సమావేశానికి వెళ్తోన్నామని.. అధికార వికేంద్రీకరణకు సంబంధించిన అంశాన్ని దావోస్ వేదికగా వివరిస్తామని స్పష్టం చేశారు. అతి పెద్ద తీరం ఉందని.. వనరులు ఉన్నాయని షోకేస్ చేస్తామని.. సుమారు 30 మల్టీ నేషనల్ కంపెనీలతో భేటీ కాబోతున్నామన్నారు గుడివాడ అమర్నాధ్. వ్యవసాయ రంగం మొదలుకుని వివిధ రంగాలకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తామని చెప్పారు.