CM Jagan wished the people of AP Ugadi: ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

అటు పెన్షన్ కోసం అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడని నిన్నటి ప్రచారంలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖున అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు పెన్షన్‌ను మీ బిడ్డ ఇంటికే పంపించాడన్నారు.