ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు సొంతం చేసుకుంది.పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది.అయితే లక్నో విజయాల వెనుక లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఉన్నాడు.
లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. “ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే అని తెలిపారు. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు వెల్లడించాను.నాకు లెజండరీ క్రికెటర్లు అలన్ బోర్డర్,వివ్ రిచర్డ్స్, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా నాకు ఇష్టం అని పేర్కొన్నారు.అదేవిధంగా సచిన్ టెండూల్కర్,బ్రియాన్ లారా కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ ఈ ప్లేయర్స్ అందరికంటే కింగ్ విరాట్ కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.కాబట్టి విరాట్ కోహ్లీ ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్‌లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని లాంగర్ పేర్కొన్నాడు.