అల్లాహ్ దీవెనలు ఏపీ ప్రజలకు ఉండాలని కోరారు ఏపీ సీఎం జగన్. రంజాన్ పండుగ నేపథ్యంలో ఏపీ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అంటూ ట్వీట్ చేశారు.
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ అని తెలిపారు సీఎం జగన్.
అటు, ప్రేమను పంచే పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సమాజంలో సోదరభావం, సామరస్యం పెంచేందుకు అందరూ ప్రతిన బూనాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.