తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రితో పాటు రోజుకు ఒక ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఇవాళ మంత్రి సీతక్క ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా జిల్లాకి ఒక టీమ్ ఏర్పాటు చేసి.. ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ సీనియర్ అధికారిని నియమించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్భార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది. అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు ప్రజా దర్భార్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.
జనం కష్టాలు వింటూ…
కన్నీళ్లు తుడుస్తూ
తొలి ప్రజా దర్బార్ సాగింది.జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/E71r3lYlur— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023