ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల శంకుస్థాపన మహోత్సవాన్ని ఆగష్ట్ 16న నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్సాట్లు ప్రారంభిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు జగన్ మోహన్ అపాయింట్‌మెంట్ కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా వీలుకానీ పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా పాల్గొనాల్సిందిగా కోరనున్నారు. ఇంకా పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనునన్నట్లు తెలుస్తుంది. దాదాపుగా 2022 సంవత్సరం నాటికి 30 లక్షలమంది పేద ప్రజలు ఇళ్ల పట్టాలను అందివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించనున్నారు.
ఈమేరకు మూడు రాజధానుల శంకుస్థాపనతోపాటు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంకూడా నిర్వహిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసిట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరిగేలా రాజధాని వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పాజెక్టని లేఖలో పేర్కొన్నారు. ఆగష్ట్ 16న మంచి ముహూర్తం ఉందని, తర్వాత 2 నెలల వరకు ముహూర్తాలు లేవని ఆయన వివరించారు. సమయం తక్కువగా ఉన్నందుకు ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ త్వరగా ఖారారు చేస్తే ముఖ్యమంత్రి జగన్ ఆయనను కలిసి ప్రాజెక్టుల గురించి వివరణఇచ్చి ఆహ్వానిస్తారిని లేఖలో కోరారు.