చిత్తూరు వైసీపీ నేత‌లు హ‌డ‌లి పోతున్నారు.. రీజ‌న్ తెలుసా..?

-

చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారు. మంత్రి స‌హా చాలా మంది నేత‌లు బెంబేలెత్తుతున్నారు. ఎవ‌రూ గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. దీంతో అస‌లు జిల్లాలో ఏమైంద‌నే ఆందోళ‌న రాజ‌కీయ నేత‌ల్లో చ‌ర్చ‌గా మారింది. జిల్లాలో రాజకీయ నేతలు, ప్రజాప్రతి నిధులెవరూ ఇల్లు దాటడం లేదు. రెండంతస్తుల భవనాల్లో ఉన్న వారైతే పై అంతస్తుకే పరిమితమవుతున్నారు. ఎవరొచ్చినా… ‘‘సార్‌ ఇంకా కిందకు రాలేదు… ఈరోజు రాకపోవచ్చు… ఏదన్నా వుంటే ఫోన్‌ చేసి మాట్లాడండి’’… అంటూ వ్యక్తిగత సహాయకులు సమాధానం చెబుతున్నారు. అత్యవసరం, తప్పనిసరి అయితేనే ఇల్లు, ఊరు విడిచి పర్యటనలు చేస్తున్నారు.

ysrcp mla doctor sudhakar tesed corona positive

అది కూడా హడావిడిగా ముగించుకుని తిరిగి ఇంటికి చేరిపోతున్నారు. చాలా మంది నేతలు అసలు జిల్లాలోనే వుండడం లేదు. స్థానికంగా అందుబాటులో లేమన్న నెపంతో ఏ కార్యక్రమాలకూ హాజరు కాకుండా, అనుచరులను, ప్రజలను కలవకుండా తప్పించు కుంటున్నారు. చివరికి విస్తృత ప్రజాసంబంధాలున్న కొందరు నేతలు సైతం తమ కదలికలను గణనీయంగా పరిమితం చేసేసుకుంటున్నారు. అధికారులకు, సన్నిహితులకు, అనుచరులకు ఫోన్‌లో మాత్రమే అందుబాటులో వుంటున్నారు. దీనంత‌టికీ కార‌ణం.. జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవ‌డ‌మే..!

దీంతో  నేతల  కుటుంబసభ్యుల ఒత్తిడే ఎక్కువగా వారిని ఇళ్ళకు పరిమితం చేస్తోంది. 50 ఏళ్ళు పైబడిన నేతలపై ఈ తరహా ఒత్తిడి మరింత అధికంగా ఉంటోంది. అదే సమయంలో స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న కొందరు నేతల వారసులు సైతం కరోనా భయంతో జిల్లా విడిచిపెట్టి కుటుంబాలతో నగరాల్లో గడుపుతున్నారు. జిల్లాలో ముఖ్యమైన హోదాలో వున్న ఓ కీలక నేత కుటుంబం ఇప్పుడు భయాందో ళనకు గురవుతోంది. ఆ నేత అల్లుడికి కరోనా పాజిటివ్‌ అని తేల‌డంతో కీలక నేత కుటుంబీకులు కూడా టెస్టులు చేయించుకున్నారు.

జిల్లాకే ఓ కీలక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గన్‌మేన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఇటీవల హైదరాబాదు నుంచీ వాహనంలో జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్యే వెంట అదే గన్‌మాన్‌ వున్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే ప్రస్తుతానికి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారట‌. మొత్తంగా జిల్లా వైసీపీలో ఉగాదులు లేవు.. ఉష‌స్సులు లేవ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news