కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన వ్యాక్సిన్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోద మూద్ర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పటి నుండి అందుబాటులోకి రానుంది, ముందుగా ఎవరికి టీకా వేస్తారు అనే అంశాలు చర్చకి వస్తున్నాయి. ఇంకా అందరికీ వ్యాక్సిన్ వేయడానికి ఎంత టైమ్ తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడానికి 8నెలల సమయం పట్టనుందట.
ముందుగా 3.లక్షల ఆరోగ్య సిబ్బంది, ఆ తర్వాత పారిశుధ్య సిబ్బంది, పోలీసులు మొదలగు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ డోసులు వేస్తారట. ఆ తర్వాత సామాన్య ప్రజలకి అందుబాటులోకి రానుందట. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం 10కోట్ల డోసులు కావాల్సి ఉందట. ఇందుకు మొత్తం 8నెలల సమయం తీసుకుంటుందని ఆరోగ్య శాఖ తెలియజేసింది.