ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ అయితే తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాల మీద ధర్మాసనం సీరియస్ అయింది. తక్షణమే నిలిపి వేయాలని జగన్మోహన్ రెడ్డిని ఆదేశించింది. ఇసుక తవ్వకాల మీద ఎన్జీటీ తీర్పు ని యధావిధిగా కొనసాగించాలని చెప్పింది అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయగద్దని నిబంధనలు ఉలంగించిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు మే 9 లోపు అఫీడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ కి ఆదేశాలను ఇచ్చింది. ఆక్రమంగా తవ్వకాలు జరిపిన వాళ్ల మీద నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్జీటీని సుప్రీంకోర్టు ధర్మసనం ఆదేశించింది. సో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయకూడదని నిబంధనలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.