కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని దర్శనం కోసం కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 87,171 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న వెంకటేశ్వరుని హుండీకి రూ. 3.68 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. కాగా, రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగనుంది. అలాగే.. రేపు సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. దీంతో రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడి పాలక మండలి.