భారతీయ చరిత్రను మార్చిన మహానీయుడు అంబేద్కర్ అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పెత్తందారితనం, అంటరానితనంపై పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. దళిత జాతి నిలబడేందుకు రిజర్వేషన్లను కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి.. విద్యా విప్లవం అన్నారు. ఇప్పటికీ రూపు మార్చుకొని అంటరానితనం సమాజంలో ఉందన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు పెత్తందారులు. అంబేద్కర్ భావ జాలం అంటే మన పెత్తందారులకు నచ్చదు. పెత్తందారులకు, పెత్తందారుల పార్టీలకు పేదలు నచ్చరు. పోరాటానికి రూపమే అంబేద్కర్. అంటరాని తనం రూపు మార్చుకుంది. పేదలను దూరంగా ఉంచడం అంటరాని తనం కాదు. పేదవారు ఇంగ్లీషు మీడియంలో చదవద్దనుకోవడం కూడా అంటరాని తనమే అన్నారు సీఎం జగన్. కొందరూ పెత్తందారులు చెబుతున్న అబద్దాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. దళిత, బలహీన వర్గాలపై ఈ పెత్తందారులకు ప్రేమ లేదన్నారు.