రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మే నుంచి ఏపీలో చిరుధాన్యాల పంపిణీ

-

ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త. ఏపీలో మే నుంచి చిరుధాన్యాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రాయలసీమ జిల్లాల్లో సరాఫరా చేయనున్నారు. ఖరీఫ్ నుంచి రాష్ట్రంలో మిల్లెట్ల సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది.

వచ్చే సీజన్ లో రైతుల నుంచి మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.130 ఉండగా… సబ్సిడీపై ప్రభుత్వం రూ.67 కే అందించనుంది. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. నిన్న RBI నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సమీకరించింది. దీంతో ఏప్రిల్ నెలలో అధికారికంగా రూ.6000 కోట్ల అప్పు తెచ్చినట్లు అయింది. ఈ రూ.6000 కోట్ల అప్పుతో పాటు, కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.3,000 కోట్లు వచ్చాయి. ఇవి గాక రాష్ట్ర ఖజానాకు రోజువారి వచ్చే పన్ను ఆదాయం సగటున రోజుకు రూ. 400 కోట్ల చొప్పున వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news