అకాల వర్షాలు..రైతు కన్నీరు..కేసీఆర్‌పై రేవంత్-బండి ఫైర్.!

-

అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కన్నీరు మిగిల్చింది. రెండు రాష్ట్రాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగింది. దీంతో ఆదుకోవాలని రైతులు..ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు..రైతులకు తక్షణమే సాయం అందించాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్ గా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ పార్టీ శ్రేణులకు రైతులకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతుందని పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇక బి‌జే‌పి నేతలు రైతుల పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై స్వయంగా వివరాలు సేకరించి,  జిల్లా కలెక్టర్లకు పంట సాయం పై వినతి పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల కోసం బిజెపి తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని, వీళ్లకు మానవత్వం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు – యువత ఏకమై బీఆర్ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుందని అన్నారు.

అయితే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులని ఆదుకుంటామని మంత్రి కే‌టి‌ఆర్ అన్నారు. కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలని, రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news