జూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డిలను అరెస్టు చెయ్యొద్దు !

-

జూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశించింది ఏపీ హై కోర్టు. ముఖ్యంగా వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Pinnelli Ramakrishna Reddy’s arrest stage ready

అనంతరం తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశించింది. నలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదు…ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని…హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టం చేసింది. వీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news