ప్రకాశం జిల్లాలో చుక్కల భూముల రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గత ఎనిమిదేళ్లుగా చుక్కల భూముల రైతులు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలోని 17, 522 మంది రైతులకు చెందిన 37 వేల ఎకరాలకు సంబంధించిన సమస్య క్లియర్ కానుంది.
ఇది ఇలా ఉండగా.. విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు ఇవాళ తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్.