జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి కౌంటర్ ఇచ్చారు. తాను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి. లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనన్న ద్వారంపూడి.. అన్నయ్య, తండ్రి పేరు చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు.
గొడవలతో పాటు కొట్టుకోవడమూ చూశాను, కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చా, ఏ విషయంలోనూ తగ్గేది లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత రేపు ఉదయం అన్ని విషయాలు వివరంగా చెప్తానని.. పవన్ కళ్యాణ్ నా మీద చేసే ఆరోపణలలో నిజం ఉంటే ఖండించనని తెలిపారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే ఖండించడమే కాదు ప్రశ్నిస్తానని వార్నింగ్ ఇచ్చారు.