వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం నాశనం అవుతుంది – చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం నాశనమైందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ నివేదికను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

” నాలుగేళ్లుగా ఏపీలో యూనివర్సిటీలో ర్యాంకింగ్ పడిపోతుంది. ఎన్ఐఆర్ఎఫ్ నివేదికను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో 29వ ర్యాంకులో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నేడు 76 వ స్థానానికి పడిపోయింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కనీసం టాప్ 100 లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైసీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది” అని ట్వీట్ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news