మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని ప్రకటించారు ఏపీ సీఎం జగన్. బనగానపల్లె లో సెంట్రల్ లైటింగ్, ఈబిసి నేస్తం, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద్ద అక్కచెల్లెమ్మలకు రూ.629 కోట్లు నేడు జమ చేసుకున్నామని చెప్పారు. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం జగన్.
కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతాడంటూ జనసేన పవన్ కళ్యాణ్ పై మరోసారి సెటైర్లు పేల్చారు సీఎం జగన్. చంద్రబాబు, దత్తపుత్రుడు పేర్లు చెబితే ఏమి గుర్తు వస్తుంది….14 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు పేరు చెబితే వంచన, దగా గుర్తు వస్తుందని ఫైర్ అయ్యారు సీఎం జగన్. దత్తపుత్రుని పేరు చెబితే వివహవ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తిగా గుర్తు వస్తాడన్నారు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చే స్టార్ గా గుర్తు వస్తారని సెటైర్లు పేల్చారు. 2014 లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్క కూటమిగా ఏర్పడి ఎన్నో హామీలు ఇచ్చారు…మహిళలకు సంబంధించిన 9 హామీలు ఇచ్చి ఒక్కటైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అమలు చేసారా అని నిలదీశారు.