ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోతుంది – జనసేన నేత

-

ఎన్నికల తర్వాత జనసేన ఊపిరి ఆగిపోతుందంటూ జనసేన నేత ఏలూరు జనసేన ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…జనసేన తరఫున పోటీ చేయబోయే24 మందిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు.. గెలిచినవారు పార్టీలో ఉంటారో లేదో అనుమానమే అంటూ బాంబ్‌ పేల్చారు.

Eluru Jana Sena in-charge Appalanaidu

భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా లేదా అనే విషయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని ప్రకటించారు. అధికారంలో షేర్ లేకుండా తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపించట్లేదన్నారు.

పవన్ ప్రకటించిన దానికి భిన్నంగా సీట్ల కేటాయింపు జరిగింది….ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం పార్టీ అభివృద్ధికి ఆటంకం అని అభిప్రాయపడ్డారు అప్పలనాయుడు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం..ఏలూరు అసెంబ్లీ సీటు దక్కకపోవడం అసంతృప్తికి గురిచేసింది. ఏలూరులో జనసేన కచ్చితంగా గెలిచేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news