మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి

-

వైసీపీ నేతల ఇళ్లపై వరుస దాడులు ఏపీలో రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. గత సర్కార్ లాగా తాము కక్ష సాధింపు చర్యలకు దిగమని చెబుతుంటే.. మరోవైపు ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు చైసీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల-చైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, గుడ్లతో దాడి చేయగా.. తాజాగా మరో చైసీపీ మాజీ మంత్రి ఇంటిపై ఎటాక్ జరిగింది. ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని యువకులు విజయవాడలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.

యువకులు రాళ్లు రువ్వడం గమనించిన జోగి రమేష్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో దుండగులు అక్కడి నుండి పరార్ అయ్యారు. కారులో వచ్చి రాళ్ల దాడికి పాల్పడినట్లు మాజీ మంత్రి భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ మేరకు జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది రాళ్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు అయితే, జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి చేసిన యువకులు జనసేన పార్టీ అభిమానులుగా సోషల్ మీడియాలో పచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news